వ్యూహం సినిమాపై తీర్పును మరోసారి వాయిదా వేసిన హైకోర్టు

  • ఈ నెల 22వ తేదీకి తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
  • తుది తీర్పును వెలువరించే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టీకరణ
  • వ్యూహం సినిమా పిటిషన్‌పై నిన్నటితో ముగిసిన విచారణ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై తీర్పు మరోసారి వాయిదా పడింది.  తీర్పును జనవరి 22వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తుది తీర్పు వెలువరించే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్నటితో విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు చెబుతామని తెలిపింది. అయితే ఈ రోజు మరోసారి 22వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News