అమరావతి నుంచి విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ

  • ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో కార్యాలయాలు తరలిస్తున్నారని పిటిషన్
  • రైతుల పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు
  • స్థలాలు, నిర్మించిన భవనాల వివరాలు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో రైతులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న ముసుగులో కార్యాలయాలు తరలిస్తున్నారని అమరావతి రైతులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. 

ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించారన్న దానిపై వివరాలు సమర్పించాలని, ఏ అవసరాలకు ఎంత విస్తీర్ణంలో భవనాలు నిర్మించారో ఆ వివరాలన్నీ తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, విచారణను ఏకసభ్య ధర్మాసనంతోనా, లేక పూర్తిస్థాయి ధర్మాసనంతో చేపట్టాలా? అనేదానిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.  

అటు, స్థలాల తరలింపుపై ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ వేసింది. సమావేశాల కోసమే విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం విచారణ సందర్భంగా వివరించింది.


More Telugu News