భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆల్ టైమ్ గరిష్ఠాలకు సూచీలు!

  • స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్ల జోరు
  • 847 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 247 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయులను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 72,568కి చేరుకుంది. నిఫ్టీ 247 పాయింట్లు లాభపడి 21,894 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (7.84%), టెక్ మహీంద్రా (4.73%), టీసీఎస్ (3.89%), విప్రో (3.88%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.85%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-1.05%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.97%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.57%), మారుతి (-0.46%).


More Telugu News