ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ కు ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది!
- ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో కల్కి 2898 ఏడీ
- మే 9న వరల్డ్ వైడ్ రిలీజ్
- 6 వేల ఏళ్ల నాటి కథ... 2024 మే 9న ప్రారంభం కానుంది అంటూ ట్వీట్
- సంబరాలు చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సెమీ మైథలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' చిత్రం విడుదలకు ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది. 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ వెల్లడి కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో సంతోషం పొంగిపొర్లుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామలు దీపిక పదుకొణే, దిశా పటానీ నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై హాలీవుడ్ స్థాయి విలువలతో తెరకెక్కుతున్న 'కల్కి...' చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా చిత్రబృందం సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఓ రక్షకుడి వేషధారణలో ఉన్న ప్రభాస్ ను ఈ పోస్టర్ లో చూడొచ్చు. '6 వేల ఏళ్ల నాటి కథ.... 2024 మే 9న ప్రారంభం కాబోతోంది' అంటూ ఈ పోస్టర్ కు టీజింగ్ క్యాప్షన్ పెట్టారు.
ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూపించని విజువల్స్ ను అత్యున్నత సాంకేతిక విలువలతో ఆవిష్కరించడానికి నాగ్ అశ్విన్ అండ్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.