ముంబై ఉగ్రదాడుల కుట్రదారు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి మృతిని నిర్ధారించిన యూఎన్ఎస్‌సీ

  • 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్
  • కార్డియాక్ అరెస్ట్‌తో గతేడాది ప్రాణాలు కోల్పోయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి
  • లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడిగా భుట్టావి   
  • వెల్లడించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి
ముంబై ఉగ్రదాడుల్లో 170 మందికిపైగా ప్రజల ప్రాణాలు హరించిన లష్కరే తోయిబా  (ఎల్ఈటీ) ఉగ్రవాదుల పాపం పండుతోంది. ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ (73) పాక్ ప్రభుత్వ కస్టడీలో 78 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తుండగా.. ఇదే కేసులో కుట్రదారు, ఎల్‌ఈటీ వ్యవస్థాపక సభ్యుడు, హఫీజ్ సయీద్ డిప్యూటీ.. హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) తాజాగా నిర్ధారించింది. 

పాకిస్థాన్‌‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గతేడాది మే నెలలో ప్రభుత్వ కస్టడీలోనే అతడు మరణించినట్టు వెల్లడించింది. 29 మే 2023లో పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిద్కేలో అతడు కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు యూఎన్ఎస్‌సీ పేర్కొంది. సయీద్ నిర్బంధంలో ఉన్నప్పుడు లష్కరే తోయిబా/జమాత్ ఉద్ దవా (ఎల్ఈటీ/జేయూడీ)కి భుట్టావీ తాత్కాలిక ఎమిర్‌గా వ్యవహరించాడు. 2008 ముంబై పేలుళ్ల తర్వాత సయీద్‌ జూన్ 2009 వరకు పాక్ నిర్బంధంలో ఉన్నాడు.


More Telugu News