వైసీపీకి రాజీనామా చేయనున్న ఎమ్మెల్యే దొరబాబు?

  • పెండెం దొరబాబుకు పిఠాపురం టికెట్ నిరాకరణ
  • ఈరోజు పుట్టినరోజు సందర్భంగా భారీ సమావేశం
  • ఇప్పటికే వేరే పార్టీ నేతలను కలిసినట్టు సమాచారం
వైసీపీలో మార్పులు, చేర్పులు ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నాయి. టికెట్ దక్కని పలువురు నేతలు పార్టీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. మరి కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ నాయకత్వం టికెట్ ను నిరాకరించడమే దీనికి కారణం. ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జీగా కాకినాడ ఎంపీ గీతను నియమించారు. దీంతో, ఆయన తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. 

మరోవైపు, ఈ రోజు దొరబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన తన అనుచరులకు ఆత్మీయ విందును ఇస్తున్నారు. ఈ సమావేశం ద్వారా తన బలాన్ని ప్రదర్శించాలని ఆయన భావిస్తున్నారు. ఇంకోవైపు, ఆయన ఇతర పార్టీ నేతలను కూడా కలిశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈనాటి సమావేశంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏ ప్రకటన చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. 



More Telugu News