'శివ'మెత్తిన దూబే... తొలి టీ20లో టీమిండియాదే విజయం

  • మొహాలీలో తొలి టీ20
  • ఆఫ్ఘనిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా
  • తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు ఆఫ్ఘన్ 158 పరుగులు 
  • 17.3 ఓవర్లలోనే కొట్టేసిన టీమిండియా
  • 40 బంతుల్లో 60 పరుగులు చేసిన దూబే
మొహాలీలో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. తద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ లో గెలుపు బోణీ కొట్టింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

యువ ఆటగాడు శివమ్ దూబే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దూబే 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ అయినా.... శుభ్ మాన్ గిల్ (23), తిలక్ వర్మ (26), జితేశ్ శర్మ (31) రాణించారు. 

చివర్లో హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. శివమ్ దూబే, రింకూ సింగ్ అజేయంగా నిలిచారు. చివర్లో నవీనుల్ హక్ బౌలింగ్ లో దూబే వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి టీమిండియాకు విజయాన్నందించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.


More Telugu News