ఏపీలో రేపు మూడు కొత్త రైళ్లను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- నంద్యాల-రేణిగుంట, నర్సాపూర్-హుబ్బళ్లి, విశాఖ-గుంటూరు రైళ్ల ప్రారంభం
- పచ్చజెండా ఊపనున్న కిషన్ రెడ్డి
- పలు ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్న రైల్వే శాఖ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీలో రేపు (జనవరి 12) మూడు కొత్త రైళ్లను ప్రారంభించనున్నారు. విశాఖ-గుంటూరు, నంద్యాల-రేణిగుంట, నర్సాపూర్-హుబ్బళ్లి రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైళ్లు రేపటి నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
అటు, పలు ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. నెం.07041 కాచిగూడ-తిరుపతి, నెం.07042 తిరుపతి-కాచిగూడ, నెం.07060 తిరుపతి-సికింద్రాబాద్, నెం.07487 హెచ్ఎస్ నాందేడ్-కాకినాడ టౌన్, నెం.07488 కాకినాడ టౌన్-హెచ్ఎస్ నాందేడ్ రైళ్లను కూడా ప్రారంభిస్తోంది.
కాచిగూడ-తిరుపతి రైలు జనవరి 12న, తిరుపతి-కాచిగూడ రైలు జనవరి 13న, తిరుపతి-సికింద్రాబాద్ రైలు జనవరి 12న, నాందేడ్-కాకినాడ రైలు జనవరి 15న, కాకినాడ-నాందేడ్ రైలు జనవరి 16న ప్రారంభం కానున్నాయి.