17 లోక్ సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
- లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే చూస్తున్నారని వ్యాఖ్య
- కేంద్రంలోనూ కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణకు మరిన్ని నిధులు వస్తాయన్న పొన్నం
- 14 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పట్టం గట్టిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ పార్టీ వైపే చూస్తున్నారన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణకు మరిన్ని నిధులు వస్తాయన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీలో చర్చించామన్నారు.
14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పదిహేడు లోక్ సభ స్థానాలకు గాను 14 చోట్ల కచ్చితంగా గెలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపిస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలో చర్చించినట్లు తెలిపారు. కాగా, అంతకుముందు లోక్ సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతలు సమావేశం నిర్వహించారు.