సీఐడీ విచారణ కోసం తిరుపతికి వచ్చిన ఎన్నారై యశస్వి
- జగన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో గత నెల యశ్ అరెస్ట్
- నాలుగు గంటల విచారణ అనంతరం 41ఏ నోటీసు ఇచ్చి విడుదల
- యశ్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో తెలుగుదేశం ఎన్నారై కార్యకర్త బొద్దులూరి యశస్వి (యశ్) తిరుపతిలో ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం పాలవడంతో చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యశ్‌ను గత నెల 23న శంషాబాద్ విమనాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లిన సీఐడీ పోలీసులు నాలుగు గంటలపాటు విచారించి 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు సీఐడీ విచారణ కోసం ఆయన తిరుపతి వచ్చారు. ఆయనకు మద్దతుగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తిరుపతి చేరుకున్నారు.