కార్యకర్త కాలుపైనుంచి దూసుకెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ కేకే కారు.. స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన ఎంపీ

కార్యకర్త కాలుపైనుంచి దూసుకెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ కేకే కారు.. స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన ఎంపీ
  • హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఘటన
  • రెండు ఎముకలు విరిగినట్టు గుర్తించిన వైద్యులు
  • సిమెంట్ పట్టీ వేసి ఇంటికి పంపిన వైనం
ప్రమాదవశాత్తు తన కారు దూసుకెళ్లడంతో గాయపడిన కార్యకర్తను బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వరంగల్ లోక్‌సభ సన్నద్ధత సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ సమావేశానికి జయశంకర్ భూపాలప్లలి జిల్లా చెల్లూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాస్ లంచ్ బ్రేక్ సమయంలో బయటకు వచ్చారు. అదే సమయంలో కేకే కారు ఆయన కాలుపై నుంచి దూసుకెళ్లింది. దీంతో గాభరాపడిన కేకే వెంటనే ఆయనను ఒమేగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు రెండు ఎముకలు విరిగినట్టు గుర్తించి సిమెంట్ పట్టీ వేసి పంపారు.


More Telugu News