ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ కొడతాను: 'నా సామిరంగ' ఈవెంటులో నాగార్జున
- ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'నా సామిరంగ'
- 3 నెలల్లో ఈ సినిమా తీశామన్న నాగార్జున
- సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడతాయని వ్యాఖ్య
- కిష్టయ్య వచ్చేస్తున్నాడంటూ హుషారెత్తించిన నాగ్
నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో ' నా సామిరంగ' సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు.
నాగార్జున ... అల్లరి నరేశ్ ... రాజ్ తరుణ్ జోడీగా నటించిన, ముగ్గురు కథానాయికలు ఈ స్టేజ్ పై అందాల సందడి చేశారు. ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతూ .. "సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ పండగ రోజున నాలుగు సినిమాలు వచ్చినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న వెంకటేశ్ కీ .. మహేశ్ బాబుకి .. తేజ సజ్జాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అన్నారు.
'నా సామిరంగ' సినిమా విషయానికి వస్తే, నాన్నగారి ఆశీస్సులతో ఈ సినిమా చేశాను. ఇక కీరవాణి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతూ వచ్చారు. ఈ సినిమాను 3 నెలల్లో తీశాము. అందుకోసం మేము ఎంత కష్టపడ్డామనేది ఇప్పుడు కాదు .. సక్సెస్ మీట్లో చెబితేనే బాగుంటుంది. పడిన కష్టం గురించి అది ఫలించిన తరువాత మాట్లాడుకుంటేనే బాగుంటుంది కదా. ఈ సారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు .. బాక్సాఫీస్ కొడుతున్నాడు..' అంటూ అభిమానులను హుషారెత్తించారు.