ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీ గడువును పొడిగించిన తెలంగాణ
- ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగింపు
- తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు
- ఇప్పటి వరకు 1 కోటి 7 లక్షల చలాన్ల చెల్లింపులు
తెలంగాణ వాహనదారులకు శుభవార్త! ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు ఉండగా... నేటి వరకు దాదాపు 1 కోటి 7 లక్షల మంది రాయితీతో కూడిన చలాన్లకు సంబంధించిన చెల్లింపులు జరిపారు. దీంతో ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.
తొలుత గత డిసెంబర్ 26వ తేదీ నుంచి నేటి వరకు పెండింగ్ చలాన్ల రాయితీకి అవకాశం కల్పించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు సగం పెండింగ్ చలాన్లు కూడా రాలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం గడువును మరో ఇరవై రోజులు పొడిగించింది.