23 నుంచి ఇండియన్ రైల్వేస్ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర
- సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానున్న యాత్ర
- తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరుల మీదుగా యాత్ర
- ఎకానమీ కేటగిరీ ఛార్జీ రూ.14,100, స్టాండర్డ్ కేటగిరీ ఛార్జీ రూ.21,500, కంఫర్ట్ కేటగిరీ ఛార్జీ రూ.27,900
భక్తులకు... పర్యాటకులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. ఈ నెల 23వ తేదీ నుంచి 'జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర' పేరిట భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రను ప్రారంభించనుంది. ఈ యాత్ర సికింద్రాబాద్‌లో ప్రారంభమై... తమిళనాడు, కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల మీదుగా రామేశ్వరం జ్యోతిర్లింగం వరకు ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే ఇదివరకు చేపట్టిన భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రలు విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ ఈ నెల 23వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు మరో యాత్రను ప్రారంభిస్తోంది.
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే రైలు తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర ప్రదేశాల మీదుగా వెళుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు... యాత్రికులు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఎక్కవచ్చు... దిగవచ్చు.
ఛార్జీల విషయానికి వస్తే ఎకానమీ కేటగిరీలో (ఎస్ఎల్) జిఎస్టీతో కలిపి ఒక్కరికి రూ.14,100, స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ) రూ.21,500, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ) రూ.27,900గా నిర్ణయించింది. ఆసక్తి కలిగిన ప్రయాణికులు IRCTC వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. లేదా 9701360701 నెంబర్‌ను కాంటాక్ట్ చేయవచ్చు.