సంక్రాంతికి ఓటీటీ తెరపైకి 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'
- 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'గా నటించిన నితిన్
- ఆయన సరసన సందడి చేసిన శ్రీలీల
- డిసెంబర్ 1వ తేదీన విడుదలైన సినిమా
- సంక్రాంతికి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్
నితిన్ హీరోగా రూపొందిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' సినిమా డిసెంబర్ 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే ఖర్చు పెట్టారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నితిన్ కి మరో ఫ్లాప్ ను కట్టబెట్టేసింది.
ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన గానీ .. 12వ తేదీన గాని ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందన్న మాట.
హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించగా, రాజశేఖర్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడు. ఇతర ముఖ్యమైన పాత్రలను రావు రమేశ్ .. సంపత్ రాజ్ .. సుదేవ్ నాయర్ .. రోహిణి పోషించారు. లవ్ .. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ సాగే కథ ఇది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి మరి.