తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో కొత్తగా 475 కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా ఆరుగురి మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,919
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత 24 గంటల్లో కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 475 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు వచ్చాయి. దేశంలో ప్రస్తుతం 3,919 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,33,402కి పెరిగింది.


More Telugu News