ఇకపై విజయ్ సేతుపతి అలాంటి పాత్రలు చేయడట!
- విలక్షణ నటుడిగా పేరున్న విజయ్ సేతుపతి
- హీరోగానే కాదు .. విలన్ గానూ బిజీ
- 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయం
- ఇకపై హీరోగా మాత్రమే చేస్తానని అన్నాడంటూ ప్రచారం
విజయ్ సేతుపతికి తమిళంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణంగా ఒక భాషలో హీరోగా చేస్తున్నప్పుడు, అదే భాషలో విలన్ గా చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఒక వైపున స్టార్ హీరోగా చేస్తూనే .. మరో వైపున స్టార్ విలన్ గా చేస్తూ తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు. అందుకు ఉదాహరణగా 'మాస్టర్' .. 'విక్రమ్' వంటి సినిమాలను చెప్పుకోవచ్చు.
ఇక మరో వైపున ఆయన ఇతర భాషల్లోను కీలకమైన పాత్రలను .. విలన్ రోల్స్ ను చేస్తున్నాడు. తెలుగులో 'ఉప్పెన' సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఆ పాత్రలో ఆయన నటనను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. అంతగా ఆయన తన ప్రభావం చూపించాడు. ఇక ఈ మధ్య బాలీవుడ్ లో 'జవాన్' సినిమాలోను కీలకమైన రోల్ చేసి, అక్కడి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఇలా ఆయన ముఖ్యమైన పాత్రలను పోషించిన కొన్ని సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాను విలన్ రోల్స్ గానీ .. గెస్టు రోల్స్ గాని చేయదలచుకోవడం లేదని విజయ్ సేతుపతి అన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇకపై అలాంటి పాత్రలకు తనని అడగొద్దని ఆయన చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.