కదులుతున్న మాల్దీవుల అధ్యక్ష పీఠం... భారత్ కు మద్దతుగా ఎలుగెత్తుతున్న మాల్దీవుల విపక్షం
- లక్షద్వీప్ లో ఇటీవల మోదీ పర్యటన
- లక్షద్వీప్ ను ప్రోత్సహించాలనేలా ట్వీట్లు
- అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
- మండిపడుతున్న భారతీయులు
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల అధికార పక్ష నేతలు విషం చిమ్మడం తెలిసిందే. అయితే ఎవరూ కూడా మాల్దీవుల అధికార పక్షానికి మద్దతు ఇవ్వడంలేదు. మద్దతు సంగతి అలా ఉంచితే, మాల్దీవుల దేశాధ్యక్ష పీఠం కదులుతోంది.
అధ్యక్ష పదవికి మహ్మద్ ముయిజ్జు రాజీనామా చేయాలంటూ విపక్షం గళమెత్తుతోంది. తాజాగా ఎంపీ అలి అజీమ్ స్పందిస్తూ... తక్షణమే దేశాధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ మీకైల్ నసీమ్ మాట్లాడుతూ... ఈ వ్యవహారంలో విదేశాంగ మంత్రి మూసా జమీర్ ను నిలదీయాలంటూ మాల్దీవుల పార్లమెంటుకు విజ్ఞప్తి చేశారు.
మాల్దీవుల మాజీ డిప్యూటీ స్పీకర్ ఎవా అబ్దుల్లా మాట్లాడుతూ, మాల్దీవుల అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కచ్చితంగా వివక్ష పూరితమైనవేనని, భారతీయులు ఆగ్రహించడంలో అర్థముందని పేర్కొన్నారు. మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా దిది కూడా భారత్ కు మద్దతు పలికారు.