మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎస్సీ కాదంటూ ఫిర్యాదు

  • ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి ఫిర్యాదు
  • సురేశ్ తల్లిదండ్రులు బీసీ (సీ) కోటాలో క్రిస్టియన్ మైనార్టీ కాలేజీ ఏర్పాటు చేశారన్న ఇమ్మాన్యుయేల్
  • సురేశ్ కూడా బీసీ (సీ) కిందకు వస్తారన్న ఫిర్యాదుదారు 
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ పై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. సురేశ్ ఎస్సీ కాదంటూ మార్కాపురంకు చెందిన ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. ఆదిమూలపు సురేశ్ తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్లో హెడ్మాస్టర్లుగా పని చేసి రిటైర్ అయ్యారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత బీసీ (సీ) కేటగిరీ కింద క్రిస్టియన్ కోటాలో శ్రీరాయలసీమ క్రిస్టియన్ మైనార్టీ కాలేజీని ఏర్పాటు చేశారని చెప్పారు. దీని ప్రకారం సురేశ్ కూడా బీసీ (సీ) కిందకు వస్తారని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి... సురేశ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ కేబినెట్ లో ఎస్సీ కోటాలోనే సురేశ్ మంత్రిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఎస్సీ కాదంటూ ఆరోపణలు రావడం ఆసక్తికరంగా మారింది.


More Telugu News