అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత
- సాయిరాజీవ్‌రెడ్డి అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం
- ఎయిర్‌పోర్టుకు వెళ్లి వస్తుండగా కారును ఢీకొట్టిన ట్రక్కు
- హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయిన ఖమ్మం జిల్లావాసి
అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గత కొంతకాలంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సాస్‌లోనే నివాసం ఉంటోంది.
కాగా కొడుకు మృతి విషయం తెలియడంతో తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా బయలుదేరారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి పెళ్లి అయ్యిందని తెలిపారు.