ఎవరు చెప్పార్రా నీకు?: కోపంతో ఊగిపోయిన దిల్ రాజు
- సంక్రాంతి బరిలో కొత్త సినిమాలు
- ప్రతి సంక్రాంతికి తనను టార్గెట్ చేస్తున్నారన్న దిల్ రాజు
- హను-మాన్ ఈవెంట్ లో చిరంజీవి వ్యాఖ్యలను వక్రీకరించారని ఆగ్రహం
- తప్పుడు రాతలు రాసే వెబ్ సైట్ల తాట తీస్తానంటూ వార్నింగ్
ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయతీగా వస్తోంది. కొందరు హీరోలకు సంక్రాంతి ఓ సెంటిమెంట్ కూడా. అదే సమయంలో, సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలకే థియేటర్లు దొరుకుతాయని, చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి.
వీటిలో ఎక్కువ శాతం విమర్శలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరుతో ముడిపడినవే. ఈ సంక్రాంతి కూడా ఎప్పట్లాగానే తనపై విమర్శలు షురూ చేశారంటూ దిల్ రాజు తాజాగా మండిపడ్డారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయంటూ కొన్ని వెబ్ సైట్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయని, ఏదో ఒకరకంగా నన్ను వివాదాల్లోకి లాగుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీ వెబ్ సైట్లకు వ్యూస్ వచ్చేందుకు నా పేరును వాడుకుంటే సహించేదిలేదు... తాట తీస్తా! నా గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్లకు ఇదే నా హెచ్చరిక" అని దిల్ రాజు స్పష్టం చేశారు.
"నిన్న హను-మాన్ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ చక్కగా చెప్పారు. దిల్ రాజు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి... ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో ఆయనకు తెలుసు అని మంచిగా చెప్పారు. కానీ చిరంజీవి గారి వ్యాఖ్యలను కొన్ని వెబ్ సైట్లు వక్రీకరించాయి. మరో అర్ధం వచ్చేలా ఆ వెబ్ సైట్లలో రాశారు.
మీ వెబ్ సైట్ ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఇతరుల గురించి తప్పుడు వార్తలు రాస్తారా? ఇతరులను ఎందుకు వాడుకుంటున్నారు? మీకిది అవసరమా? దిల్ రాజు మెతక అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. ఎందుకులే... సాఫ్ట్ గా వెళదాం అని అనుకునేవాడ్ని. కానీ ఈ రాతలు చూశాక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదు.
మీకేమైనా ఆ చిత్ర నిర్మాత చెప్పాడా...? ఆ వెబ్ సైట్లకు దమ్ముంటే ఆ నిర్మాతను ఈ వేదికపైకి తీసుకువచ్చి... నన్ను, ఆ నిర్మాతను ప్రశ్నించండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్ను టార్గెట్ చేస్తుంటారు? ఇండస్ట్రీలో 95 శాతం మంది నన్ను ఇష్టపడతారు. మిగతా ఐదు శాతం మంది నన్ను ఇష్టపడతారా లేదా అన్నది వాళ్లిష్టం.
చాలామందితో నేను సంతృప్తికరంగా వ్యవహరిస్తున్నాను కాబట్టే ఇండస్ట్రీలో ఇవాళ నాకింత మంచిపేరుంది. దిల్ రాజు అంటే ఒక బ్రాండ్. కానీ వ్యాపారపరంగా వచ్చే కొన్ని వివాదాలను తీసుకుని వాటిని వాడుకుంటున్నారు. అది 100 శాతం తప్పు.
సంక్రాంతి సినిమాలకు సంబంధించి మొన్న చాంబర్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి రవితేజ గారిని ఒప్పించి ఒక సినిమాను సంక్రాంతి బరి నుంచి పక్కకు జరిపాం. అది ఎంత కష్టమో మాకు తెలుసు. ఆ తర్వాత... దిల్ రాజు ఒక తమిళ సినిమా విడుదల చేస్తున్నాడంటూ వార్త రాశారు. ఎవరు చెప్పార్రా నీకు... నేను తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాను అని? ఏదైనా ఆధారం ఉందా? తెలుగులో ఇప్పుడు రిలీజ్ వద్దు అని ఆ తమిళ సినిమాను కూడా వాయిదా వేయించింది నేను.
ఇందాక చెప్పాను కదా తాటతీస్తాను అని... దాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఇన్నిరోజులు ఎలాగో నడిచిపోయాయి... ఇక నుంచి నా గురించి వివాదాస్పదమైన వార్తలు రాస్తే ఊరుకునేదిలేదు" అంటూ దిల్ రాజు ఘాటుగా హెచ్చరించారు.