అయోధ్య ఆహ్వానం.. భావోద్వేగంలో ముస్లిం కరసేవకుడు

  • 1992లో కరసేవకుడిగా పోరాడిన మహ్మద్ హబీబ్
  • ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్లు
  • హబీబ్ కు అందిన అక్షింతలు, ఆహ్వానం
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ఒక ముస్లిం కరసేవకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ బెంగాల్ కు చెందిన మహ్మద్ హబీబ్ (70) అనే వ్యక్తికి శ్రీరాముడి అక్షింతలు, ఆహ్వానం పంపింది. ఓ మామూలు రైతుగా సాధారణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందడంపై ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో 1992 డిసెంబర్ 2 నుంచి నాలుగైదు రోజుల పాటు అయోధ్యలో ఉండి ఆయన కరసేవకుడిగా పోరాడాడు. ఆరోజు ఆయన చేసిన పోరాటాన్ని అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ గుర్తించింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు.


More Telugu News