అంగన్వాడీల సేవలు నిత్యావసర సేవలే అయితే వారి డిమాండ్లను తీర్చాల్సిందే: లక్ష్మీనారాయణ

  • ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు
  • అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం
  • అంగన్వాడీలకు మద్దతు పలికిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన వీవీ లక్ష్మీనారాయణ స్వచ్చంద పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. తొలుత జనసేనలో చేరి, ఆపై బయటకు వచ్చి ఇటీవలే జై భారత్ నేషనల్ పార్టీ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఆయన మరోసారి విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. 

లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో గళం వినిపిస్తున్నారు. తాజాగా, ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు పలికారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించారు. 

అంగన్వాడీల సేవలు నిత్యావసర సేవలే అయితే... ప్రభుత్వం వారిపై నిత్యావసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగించడానికి బదులు వారి నిత్యావసర డిమాండ్లను తప్పనిసరిగా నెరవేర్చాలని లక్ష్మీనారాయణ సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.


More Telugu News