తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం.. జాబితా ఇదిగో!
- లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ
- హైదరాబాద్ ఇన్ఛార్జీగా రాజాసింగ్
- సికింద్రాబాద్ ఇన్ఛార్జీగా డాక్టర్ లక్ష్మణ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను ప్రకటించింది.
నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు:
నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు:
- ఆదిలాబాద్ - పాయల్ శంకర్ (ఎమ్మెల్యే)
- పెద్దపల్లి - రామారావ్ పవార్ (ఎమ్మెల్యే)
- కరీంనగర్ - సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
- నిజామాబాద్ - మహేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే)
- జహీరాబాద్ - కె.వెంకటరమణా రెడ్డి (ఎమ్మెల్యే)
- మెదక్ - పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
- మల్కాజిగిరి - పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
- సికింద్రాబాద్ - డాక్టర్ లక్ష్మణ్ (ఎంపీ)
- హైదరాబాద్ - రాజాసింగ్ (ఎమ్మెల్యే)
- చేవెళ్ల - ఏ వెంకటనారాయణ రెడ్డి (ఎమ్మెల్సీ)
- మహబూబ్ నగర్ - రామ్ చందర్ రావు (మాజీ ఎమ్మెల్సీ)
- నాగర్ కర్నూల్ - రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
- నల్గొండ - చింతల రామచంద్రా రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
- భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
- వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
- మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
- ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)