'వ్యూహం' సినిమా విడుదలపై విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
- సినిమా విడుదలపై పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు
- సెన్సార్ సర్టిఫికెట్, రికార్డులను కోర్టుకు సమర్పించిన సెన్సార్ బోర్డు
- రికార్డులను పరిశీలించిన తర్వాత విచారణ జరుపుతామన్న హైకోర్టు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమా నిర్మాత వేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. సెన్సార్ బోర్డు రికార్డును పరిశీలించిన తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రేపు మరోసారి విచారణ చేపడతామని చెప్పింది.
ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లను కించపరిచేలా ఉందంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర నిర్మాత అప్పీల్ చేశారు.