ఈ సంక్రాంతికి వస్తున్న టాలీవుడ్ సినిమాలు ఇవే!
- సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న స్టార్ల సినిమాలు
- 12న గుంటూరు కారం విడుదల
- 13న సైంధవ్.. 14న నా సామిరంగ రిలీజ్
స్రంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి పెరుగుతుంది. సంక్రాంతి వేడుకలతో అన్ని గ్రామాలు, లోగిళ్లు కళకళలాడతాయి. సినిమా థియేటర్లు కూడా సందడిగా మారతాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
గుంటూరు కారం: మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. తమన్ సంగీతాన్ని అందించగా... హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై సినిమాను నిర్మించారు. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
నా సామిరంగ: నాగార్జున, అషికా రంగనాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా శ్రినివాస చిట్టూరి దీనిని నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
సైంధవ్: వెంకటేశ్ 75వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య ప్రధాన పాత్రలను పోషించారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించగా... వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు. జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది.
హను-మాన్: యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ఆంజనేయస్వామి కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'హను-మాన్'. ఒక సామాన్యుడు అసామాన్యమైన శక్తులను పొంది... చెడుపై ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా ప్రధాన కథ. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.