కేపీహెచ్బీలో కారు ప్రమాదం.. మాజీ మంత్రి మేనల్లుడి నిర్వాకం
- మద్యం మత్తులో కారు నడిపిన మాజీ మంత్రి మేనల్లుడు
- రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన అగ్రజ్
- ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమేనని పోలీసులు తెలిపారు.
మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్ తన స్నేహితులతో కలిసి సోమవారం తెల్లవారుజాము వరకు మద్యం సేవించాడు. ఆపై కారులో స్నేహితులతో కలిసి బయలుదేరాడు. కేపీహెచ్బీ ఫోరం మాల్ సమీపంలో కారును రాంగ్ రూట్‌లోకి మళ్లించాడు. రాంగ్ రూట్ లో వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై వెళుతున్న ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టామని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు.