ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా తరహా కూటమిని ఏర్పాటు చేస్తాం: జేడీ శీలం

  • షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహం నెలకొందన్న జేడీ శీలం
  • వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీతో ఉన్నాయని వ్యాఖ్య
  • 175 సీట్లు రావాలని కోరుకోవడం జగన్ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శ
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ నేతలు యాక్టివ్ అవుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ ఉనికిని చాటుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని కలిపి ఇండియా కూటమి తరహాలో కూటమిని ఏర్పాటు చేస్తామని సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తెలిపారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతోనే ఉన్నాయని చెప్పారు. 

రాష్ట్రంలో 175కి 175 సీట్లు వైసీపీకే రావాలని కోరుకోవడం సీఎం జగన్ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఏడు గ్యారంటీలతో ఏపీలో అధికారంలోకి వస్తామని చెప్పారు. వైఎస్ షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహం నెలకొందని అన్నారు. రాజమండ్రిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక సమాలోచన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేడీ శీలం మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ కూడా హాజరయింది. జాతీయ న్యాయవాదుల సంఘం నాయకుడు ముప్పాళ్ల సుబ్బారావు కూడా హాజరయ్యారు.


More Telugu News