కోచ్ అవ్వాలనుకుంటున్నా: డేవిడ్ వార్నర్

  • ఇటీవలే టెస్టులు, వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్
  • భవిష్యత్తులో కోచ్ కావాలన్నదే తన ఆశయమని వెల్లడి
  • ఐపీఎల్ లాంటి టోర్నీలతో స్లెడ్జింగ్ కనుమరుగవుతుందని కామెంట్
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాను భవిష్యత్తులో కోచ్ అవ్వాలనుకుంటున్నట్టు తెలిపాడు. టెస్టులు, వన్డేలకు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే, ఐపీఎల్ వంటి లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలు పంచుకుంటున్నారని, ఫలితంగా వచ్చే పదేళ్లలో స్లెడ్జింగ్ దూరమవుతుందని తెలిపాడు. 

‘‘నాకో ఆశయం ఉంది. క్రికెట్ కెరీర్ తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా. మొదట నా భార్యతో మాట్లాడాలి. ఇంకొంత కాలం ఇంటికి దూరంగా ఉండేందుకు అనుమతిస్తుందో లేదో చూడాలి. జట్టులోకి వచ్చిన కొత్తలో మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల ముఖాల్లోకి చూసేవాడిని. వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కలవరపెట్టడం ద్వారా వారి ఫామ్ దెబ్బతీసేవాడిని. జట్టు నన్ను అలాగే తీర్చిదిద్దింది. ఇకపై అలాంటి స్లెడ్జింగ్ చూస్తారని అనుకోను. వచ్చే అయిదు, పదేళ్లల్లో అంతా మారిపోతుంది. స్లెడ్జింగ్ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారు’ అని వార్నర్ తెలిపాడు.


More Telugu News