వైజాగ్ ఈవెంటులో సందడి చేసిన వెంకటేశ్!
- వైజాగ్ లో జరిగిన 'సైంధవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- వైజాగ్ తో అనుబంధాన్ని గురించి చెప్పిన వెంకీ
- అభిమానులను హుషారెత్తిస్తూ స్పీచ్
- ఈ నెల 13వ రిలీజ్ కానున్న సినిమా
వెంకటేశ్ హీరోగా ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రావడానికి 'సైంధవ్' సినిమా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ వేదికపై వెంకటేశ్ మాట్లాడుతూ .. " నా మొదటి సినిమా 'కలియుగ పాండవులు' సినిమాకి .. ఆ తరువాత 'సుందర కాండ' సినిమాకి ఇక్కడికి వచ్చాను. పెళ్లికాని ప్రసాద్ ఇక్కడి రోడ్లపైనే కదా తిరిగాడు. 'గోపాల గోపాల కోసం పవన్ తో వచ్చాను .. 'సీతమ్మవాకిట్లో' కోసం మహేశ్ తో వచ్చాను" అన్నారు.
' సైంధవ్' షూటింగు కూడా ఇక్కడ చేశాము .. ఇప్పుడు ఈ ఫంక్షన్ కోసం కూడా ఇక్కడికే వచ్చాము. ఇది అన్ని వయసుల వారు చూడవలసిన సినిమా .. అందరూ తప్పకుండా థియేటర్లకు రావాలి. గతంలో ఎమోషనల్ టచ్ తో నేను చేసిన సినిమాలను ఆదరించారు. ఈ సినిమాకి వచ్చినవారు తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారు" అని చెప్పారు.
వెంకటేశ్ ఈ సినిమాలోని 'షర్టు వేసుకున్న ప్రతివాడికీ ఒక కాలర్ ఉంటుందిరా ... కానీ ఆ కాలర్ ఎవడి మీద ఉందో చూసుకుని రెస్పెక్ట్ ఇవ్వాలిరా' అనే డైలాగ్ చెప్పి అభిమానులను హూషారెత్తించారు. ఇక అందరూ హెల్త్ బాగా చూసుకోవాలనీ .. జీవితాన్ని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పారు. ఇక రామజోగయ్య శాస్త్రి తాను రాసిన 'బుజ్జికొండ' పాటను స్టేజ్ పై ఆలపించారు.