మా నాన్న లైఫ్ లో హనుమంతుడు చేసిన మిరకిల్ అది: చిరంజీవి
- 'హను మాన్' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి
- పొన్నూరు .. బాపట్ల .. మొగల్తూరు సంఘటనల ప్రస్తావన
- ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా
తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన 'హను మాన్' సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతూ .. "నేను ఈ ఫంక్షన్ కి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నా ఇష్టదైవం హనుమంతుడికి సంబంధించిన కంటెంట్ తో ఈ సినిమా రూపొందడం ప్రధానమైన కారణం" అని అన్నారు.
" తేజ సజ్జా నా ముందు డైపర్లు వేసుకునే స్థాయి నుంచి .. డయాస్ పైన హీరోగా మాట్లాడే స్థాయికి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అతని కోసమే వచ్చాననేది రెండో కారణం. ఇక ట్రైలర్ తోనే నన్ను మెప్పించిన ప్రశాంత్ వర్మ మూడో కారణమని చెబుతాను. హనుమ ఆశీస్సుల కారణంగానే నాకు ఒక లక్ష్య సాధన .. నిబద్ధత అలవడ్డాయని నేను భావిస్తూ ఉంటాను. అలాంటి హనుమతో నాకు ఒక అనుబంధం ఉంది. ఆయనను నమ్ముకోవడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను " అని చెప్పారు.
" నేను ఏడవతరగతి చదువుతూ ఉండగా ... హనుమంతుడి గుడికి వెళ్లి వస్తుండేవాడిని. ఆ తరువాత బాపట్లలో 8వ క్లాసు చదువుతూ ఉండగా హనుమంతుడి గుడికి ప్రసాదం కోసం వెళ్లేవాడిని. అలా ఆయనపై నాకు భక్తి భావం పెరిగిపోయింది. ఆ తరువాత మొగల్తూర్ వెళ్లిన తరువాత, ఒక హనుమ కేలండర్ నా చేతికి వచ్చింది. ఈ రోజున ఆ కేలండర్ మా ఇంట్లో ఉంది. దానిని ఫ్రేమ్ కట్టించి పూజిస్తూనే ఉన్నాను" అని అన్నారు.
"నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా ఫాదర్ కి ఒక ఊరుకి ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడికి వెళ్లడం నాన్నకు ఇష్టం లేదు. ఆయనకి దేవుళ్లపై నమ్మకం ఉండేది కాదు. అయినా హనుమాన్ చాలీసా చదవమని చెప్పాను. అలా చేస్తే అనుకున్న చోటికి ట్రాన్స్ ఫర్ అవుతుందని అన్నాను. నా మాట నమ్మి నాన్న అలాగే చేశారు .. అలాగే జరిగింది. 'నాకు హనుమను పరిచయం చేసిన మా పెద్దబ్బాయినే నా గురువు' అని మా నాన్నగారు అందరితో చెప్పేవారు" అంటూ ఆనాటి అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.