మీ తాత, ముత్తాతలు ఇచ్చిన ఆస్తులపై ఈ రంగుల పిచ్చోడి ఫొటో ఏంటయ్యా!: చంద్రబాబు
- తిరువూరులో టీడీపీ రా కదలిరా సభ
- హాజరైన చంద్రబాబు
- ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు అంటూ విమర్శలు
- అమ్మ తరఫు చుట్టమా, నాన్న తరఫు చుట్టమా అంటూ వ్యాఖ్యలు
తిరువూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు అని అభివర్ణించారు. ఎక్కడ ఏది చూసినా ఆయనకు ఆ రంగు వేసేయాలి, ఆయన ఫొటో వేయాలి అని ఎద్దేవా చేశారు.
"మేం టిడ్కో ఇళ్లు కడితే దానికి వీళ్లు రంగేసుకున్నారు. దానికి ఆయన ఫొటో, ఆయన పేరు... ఇదెక్కడి అన్యాయమో నాకు అర్థం కావడంలేదు. సర్వే అని చెప్పి ఆఖరికి మీ పొలం రాళ్లపైనా కూడా తన బొమ్మ వేసుకున్నాడు. పొలాల్లో రాళ్లపైనా, పట్టాదారు పాస్ పుస్తకంపైనా తన బొమ్మ వేశాడు. ఈయన మీ అమ్మ తరఫున చుట్టమా? లేక, మీ నాన్న తరఫున చుట్టమా? మీ దూరపు బంధువా? మరి ఎందుకా ఫొటో?
ఇదేంటని గట్టిగా అడిగితే కేసులు పెడతారన్న భయంతో మీరు ప్రశ్నించరు. కానీ మీకు ఓటు హక్కు ఉందన్న విషయం మర్చిపోవద్దు. మీ తాత, ముత్తాతలు వారసత్వంగా ఇచ్చిన ఆస్తులపై ఈ రంగుల పిచ్చోడి ఫొటో ఏంటయ్యా!
ఇతడ్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే... చివరికి మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం టీడీపీ హయాంలో 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం. ఏముంది... అక్కడ కూడా ఈ పిచ్చోడి ఫొటో వేస్తారు. మరుగుదొడ్డి బయట వేస్తే ఫర్వాలేదు... లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు కానీ ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు" అని చంద్రబాబు పేర్కొన్నారు.