క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామాపై తిరువూరు సభలో చంద్రబాబు వ్యాఖ్యలు

  • వైసీపీకి గుడ్ బై చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు
  • పార్టీలో చేరిన పది రోజులకే రాజీనామా
  • జగన్... రాయుడ్ని నమ్మించి మోసం చేశాడన్న చంద్రబాబు
  • రాయుడు ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు  చేసిన రా కదలిరా సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు స్పందించారు. 

"అంబటి రాయుడు... ఓ క్రికెటర్. గుంటూరు జిల్లాకు చెందినవాడు. రాయుడు ఆశపడడంలో తప్పులేదు. కానీ జగన్ మాయగాడు. రాయుడ్ని నమ్మించి మోసం చేశాడు. రాయుడ్ని మాయ చేశాడు. నీకు గుంటూరు పార్లమెంటు స్థానం ఇచ్చేస్తాం... పోయి పని చేసుకో అని నమ్మబలికాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇంకొకరిని పిలిచి గుంటూరు స్థానం నీకిచ్చేస్తా అన్నాడు. ఆ పేరు నేను చెప్పను. దాంతో రాయుడికి విషయం అర్థమైపోయింది. ఆయన నైజం ఏంటో గుర్తించాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని తెలుసుకుని... ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడు" అంటూ  చంద్రబాబు వివరించారు.


More Telugu News