ముగిసిన ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం
- ప్రజల నుంచి కోటికి పైగా దరఖాస్తులు!
- డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
- జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - అభయహస్తం కార్యక్రమం శనివారంతో ముగిసింది. ప్రజల నుంచి కోటికి పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 650 కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఒక్కో మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5 లక్షల యువ వికాసం, రూ.4 వేల పెన్షన్, రేషన్ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని ప్రారంభించింది. ఆ తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారెంటీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.