ఈ నెల 9న వెంకటగిరిలో 'రా కదలిరా' సభ వాయిదా... కారణం ఇదే!
- రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ రా కదలిరా సభలు
- ఈ నెల 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో సభలు
- అదే రోజు ఉదయం ఈసీని కలవనున్న చంద్రబాబు, పవన్
- వెంకటగిరి సభ వాయిదా... ఆళ్లగడ్డ సభ యథాతథం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రా కదలిరా పేరిట టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కనిగిరిలో 'రా కదలిరా' సభకు హాజరై వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని సభలకు చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. ఈ క్రమంలో జనవరి 9న వెంకటగిరిలో సభ ఏర్పాటు చేశారు.
అయితే అదే రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి వస్తోంది. దాంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు, పవన్ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే, వెంకటగిరి సభ వాయిదా వేశారు. అదే రోజు మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభ యథాతథంగా జరగనుంది.