సూర్యాపేట జిల్లాలో పల్టీలు కొట్టిన రాజధాని ఏసీ బస్సు
- మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బస్సు బోల్తా
- హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న బస్సు
- అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తింపు
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు మినహా... ఎవరికీ ఏమీ కాలేదు. ఖమ్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై ఈ బస్సు బోల్తా పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.