'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాలో క్లైమాక్స్ హైలైట్: అంజలి
- సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'
- హారర్ కామెడీ జోనర్లో నడిచే కథ
- కొత్త పాత్రలు మరింత ఆసక్తిని పెంచుతాయన్న అంజలి
- పెద్ద హిట్ అవుతుందని వ్యాఖ్య
అంజలి ప్రధానమైన పాత్రగా గతంలో వచ్చిన 'గీతాంజలి' హారర్ కామెడీ జోనర్లో మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందింది. ఎంవీవీ సత్యనారాయణ - జీవీ నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా శివ తుర్లపాటి పరిచయమవుతున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.
ఈ వేదికపై అంజలి మాట్లాడుతూ .. "నా కెరియర్లో నేను చేసిన ఫస్టు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గీతాంజలి' ఆ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ నమ్మకంతోనే 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాను నేను చూశాను .. చాలా బాగా వచ్చింది. సినిమా మొత్తం ఒక ఎత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తులో కనిపిస్తుంది" అని అన్నారు.
" సెకండు పార్టులో సునీల్ గారు .. అలీ గారు .. సత్యం రాజేశ్ గారు మరింత వెయిట్ పెంచారు. ఈ సినిమా కోసం వేసిన సెట్ కూడా ప్రేక్షకులను మరింతగా భయపెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో 'సెట్'ను ఒక పాత్రగా చెప్పుకోవచ్చు. కోన గారు మొత్తం సినిమాను డిజైన్ చేసిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు.