గ్యాంగ్‌స్టర్ గాళ్‌ఫ్రెండ్ రూ. 100 కోట్ల బంగళా సీజ్.. ఎవరీ కాజల్ ఝా?
- ఢిల్లీలో స్క్రాప్ మెటల్ మాఫియాపై నోయిడా పోలీసుల ఉక్కుపాదం
- రూ. 200 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం
- స్క్రాప్ డీలర్ నుంచి మిలియనీర్‌గా ఎదిగిన రవికానా
- ఉద్యోగం కోసం వచ్చి గ్యాంగ్‌లో చేరి గ్యాంగ్‌స్టర్‌కు గాళ్‌ఫ్రెండ్‌గా మారిన కాజల్
స్క్రాప్ మెటల్ మాఫియా, గ్యాంగ్‌స్టర్ రవికానా ఆయన గ్యాంగ్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల విలువైన ఆస్తులను నోయిడా పోలీసులు సీజ్ చేశారు. అలాగే, సౌత్ ఢిల్లీలోని రవికానా గాళ్‌ఫ్రెండ్ కాజల్ ఝా బంగ్లాపై దాడిచేసి సీజ్ చేశారు. 100 కోట్ల రూపాయల విలువైన ఈ బంగ్లాను గ్యాంగ్‌స్టర్ ఆమెకు బహుమతిగా ఇచ్చాడు.
ఉద్యోగం కోసం వచ్చి
ఉద్యోగం కోసం రవికానా వద్దకు వచ్చిన కాజల్ ఝా ఆ తర్వాత ఆ గ్యాంగ్‌లో చేరి ముఖ్యమైన సభ్యురాలిగా మారింది. గ్యాంగ్‌స్టర్ ఆస్తులకు బినామీగా ఉండడంతోపాటు పుస్తకాల నిర్వహణకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో తనకు గాళ్‌ఫ్రెండ్‌గా మారిన కాజల్‌కు సౌత్ ఢిల్లీలోని ఖరీదైన న్యూ ఫ్రెండ్స్ కాలనీలో రూ. 100 కోట్ల విలువైన మూడంతస్తుల బంగళాను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
పోలీసుల కథనం ప్రకారం స్క్రాప్ డీలర్ అయిన రవికానా రేబర్, స్క్రాప్ మెటీరియల్ అమ్మకం, కొనుగోలుకు సంబంధించి 16 మంది గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో స్క్రాప్‌ను సేకరించడం, అమ్మడం, ఎగుమతి చేయడం ద్వారా మిలియనీర్‌గా మారాడు. కాగా, గ్యాంగ్‌స్టర్, ఆయన ముఠాపై పోలీసులు ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేశారు. వీటిలో కిడ్నాప్, దొంగతనం వంటివి కూడా ఉన్నాయి.