టేకాఫ్ అయిన వెంటనే ఊడిన విమానం డోర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో ఇదిగో!
- అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఘటన
- విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఊడిన డోర్
- బయటకు ఎగిరిపడిన ప్రయాణికుల ఫోన్లు
- ఘటన సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే డోర్ ఊడిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం పోర్ట్‌ల్యాండ్ నుంచి ఒంటారియోకు ప్రయాణికులతో బయలుదేరింది. విమానం 16 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో డోర్ అకస్మాత్తుగా ఊడిపోయింది.
దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు అలాస్కా ఎయిర్‌లైన్స్ తెలిపింది. కాగా, విమానం డోర్ ఊడిన పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. డోర్ ఊడడంతో కొందరు ప్రయాణికుల ఫోన్లు బయటకు ఎగిరిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.