రైల్వేకు రూ. 1.22 కోట్ల నష్టం తెచ్చిన పొగమంచు
- మొరాదాబాద్ డివిజన్‌లో భారీ నష్టం
- రైళ్ల ఆలస్యం, రద్దు కారణంగా 20 వేల టికెట్ల రద్దు
- ఆ మొత్తం సొమ్మును వెనక్కి ఇచ్చిన రైల్వే
ఉత్తరభారతదేశంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యం కావడం, కొన్ని రైళ్లు రద్దు కావడం వంటి కారణాలతో రైల్వే రూ.1.22 కోట్లు నష్టపోయింది. మొరాదాబాద్ డివిజన్‌లో గతేడాది డిసెంబర్‌లో 20 వేల రిజర్వేషన్ టికెట్ల రద్దు కారణంగా ఈ నష్టం ఏర్పడింది. ఈ మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లించినట్టు మొరాదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాజ్‌కుమార్‌సింగ్ తెలిపారు.
బరేలీలో 4,230, మొరాదాబాద్‌లో 3,239, హరిద్వార్‌లో 3,917, డెహ్రాడూన్‌లో 2,448 టికెట్లు సహా మొత్తం 20 వేలు రద్దయ్యాయి. పొగమంచు పరిస్థితుల కారణంగా రైళ్లు రద్దు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా డిసెంబర్ 2023లో మొరాదాబాద్ డివిజన్‌లో 20 వేల టికెట్లు కూడా రద్దు చేశామని రాజ్‌కుమార్ తెలిపారు. మార్చి వరకు 42 రైళ్లు క్యాన్సిల్ కావడంతో రూ. 1.22 కోట్లు వెనక్కి చెల్లించినట్టు వివరించారు.