రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
  • దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ స్టేషన్‌గా నిలిచిన రాజేంద్రనగర్ పీఎస్
  • డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్
  • ట్రోఫీని అందుకున్న ఎస్‌హెచ్ఓ బి.నాగేంద్రబాబు
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీఎస్ ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎస్‌హెచ్ఓ బి.నాగేంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కు మొదటిస్థానం రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 2023లో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ స్టేషన్‌గా మొదటి స్థానంలో నిలిచినందుకు... గౌరవనీయులైన డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు అభినందనలు అని ట్వీట్ చేశారు. ఈ మేరకు స్టేషన్ ఎస్‌హెచ్ఓ బి.నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు.


More Telugu News