బీఆర్ఎస్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందన్న సింగిరెడ్డి
- ప్రజలు బీఆర్ఎస్‌తోనే ఉన్నారని వెల్లడి
- ఢిల్లీలో తెలంగాణ నేతలు అంటే బీఆర్ఎస్ నాయకులే గుర్తుకు వస్తారని వ్యాఖ్య
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినందుకు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కేవలం రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని తెలిపారు. తక్కువ ఓట్ల శాతంతో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌తోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ నేతలు అంటే చాలు బీఆర్ఎస్ పార్టీ.. పార్టీ నాయకులే గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అన్నారు.