చిత్ర పరిశ్రమ బాగుండాలని ఓ అడుగు వెనక్కి వేశాం అంతే!: రవితేజ

  • రవితేజ కొత్త చిత్రం 'ఈగల్' విడుదల వాయిదా
  • ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతోందన్న మాస్ మహారాజా
  • రావడంలో చిన్న మార్పు తప్పితే గురిలో మార్పులేదని ధీమా
మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం 'ఈగల్' విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హను-మాన్ వంటి పలు చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో 'ఈగల్' ను ఫిబ్రవరి 9న తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. దీనిపై హీరో రవితేజ స్పందించారు. 

మన తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలన్న ఉద్దేశంతోనే ఓ అడుగు వెనక్కి వేశామని స్పష్టం చేశారు. రావడంలో చిన్న మార్పు తప్పితే, గురిలో ఎలాంటి మార్పులేదని ధీమా వ్యక్తం చేశారు. 'ఈగల్' చిత్రం 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వస్తోందని రవితేజ వెల్లడించారు. సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని చిత్రాలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

నిన్న హైదరాబాదులో తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణ ఫిలిం చాంబర్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దలు సమావేశమై సంక్రాంతి చిత్రాల మధ్య క్లాష్ రాకుండా ఏం చేయాలన్నదానిపై చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే 'ఈగల్' చిత్రం విడుదలను మరో తేదీకి మార్చారు. వాస్తవానికి ఈ చిత్రం జనవరి 13న రావాల్సి ఉంది.


More Telugu News