కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని స్పందన!
- పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పారన్న కేశినేని నాని
- నాని వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న చిన్ని
- విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని చిన్నికి దక్కే అవకాశం
వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా తన స్థానంలో మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని.... పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని తమ అధినేత చంద్రబాబు ఆదేశించారని ఎంపీ కేశినేని నాని తెలిపిన సంగతి తెలిసిందే. తమ అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని కూడా ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో నాని సోదరుడు కేశినేని చిన్ని స్పందిస్తూ... కేశినేని నాని ఫేస్ బుక్ పోస్టుతో తనకు సంబంధం లేదని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఉండటం సహజమేనని అన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం తిరువూరు సభను విజయవంతం చేయడంపైనే ఉందని అన్నారు. తిరువూరు సభకు లక్షకు పైగా పార్టీ శ్రేణులు, అభిమానులు వస్తారని తెలిపారు. టీడీపీలో తాను ఒక సామాన్య కార్యకర్తను మాత్రమేనని చెప్పారు.
మరోవైపు, ఈ నెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్ల బాధ్యతను కేశినేని చిన్నికి టీడీపీ అప్పగించింది. ఈ సారి విజయవాడ ఎంపీ టికెట్ కూడా చిన్నికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆయన పెద్ద ఎత్తున రాజకీయ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.