ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్.... రేసులో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు
- ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేషన్లు
- నాలుగు నామినేషన్లలో ముగ్గురు భారత క్రికెటర్లే!
- అవార్డు కోసం పోటీ పడుతున్న కోహ్లీ, షమీ, గిల్
ఇటీవల సొంతగడ్డపై ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన ఒక్క ఫైనల్లో తప్ప మిగతా అన్ని మ్యాచ్ ల్లో బ్రహ్మాండంగా సాగింది. ఈ నేపథ్యంలో, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకులు మెరుగయ్యాయి. అంతేకాదు, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులోనూ మనవాళ్లు ఉరకలేస్తున్నారు.
తాజాగా, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్-2023 అవార్డు కోసం విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శుభ్ మాన్ గిల్ నామినేట్ అయ్యారు. ఈ అవార్డు కోసం మొత్తం నలుగురు నామినేట్ కాగా, ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే కావడం విశేషం. ఇక, నాలుగో ఆటగాడు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్.
ఇటీవల వరల్డ్ కప్ లో కోహ్లీ ప్రదర్శన చూస్తే అద్భుతం అనదగ్గరీతిలో సాగింది. కోహ్లీ 11 మ్యాచ్ ల్లో 9 ఇన్నింగ్స్ లు ఆడి 765 పరుగులు వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నమోదు చేశాడు.
ఇదే వరల్డ్ కప్ లో మహ్మద్ షమీ లేటుగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, సంచలన బౌలింగ్ తో ప్రకంపనలు సృష్టించాడు. 7 మ్యాచ్ ల్లోనే 24 వికెట్లు తీసి తనలోని కసిని ఘనంగా చాటుకున్నాడు. అంతేకాదు, వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ కప్ లలో షమీ మొత్తం 18 మ్యాచ్ లలో 55 వికెట్లు పడగొట్టాడు.
ఇక, యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ప్రదర్శన చూస్తే... 2023 ఏడాదిలో అతడు 100కి పైగా స్ట్రయిక్ రేటుతో ఐదు సెంచరీలు సాధించడం విశేషం. 2023లో వన్డే ఫార్మాట్ లో గిల్ సాధించిన పరుగులు 1,584... యావరేజి 63కి పైమాటే. వరల్డ్ కప్ లోనూ గిల్ మెరుగ్గా రాణించాడు. 44.25 సగటుతో 354 పరుగులు నమోదు చేశాడు.