షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

  • వైసీపీలో అవకాశం లేక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి
  • షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని వ్యాఖ్య
  • ఎన్ని జాకీలను పెట్టినా లోకేశ్ లేవడని ఎద్దేవా
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అవకాశం లేక షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని... ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. జగన్ ను జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా... వారిని తాము రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తామని అన్నారు. తమ నాయకుడు జగన్ కోసం తాము ఎప్పటికీ పని చేస్తూనే ఉంటామని చెప్పారు. జగన్ ను మరోసారి సీఎంగా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం చంద్రబాబు, సోనియాగాంధీల నైజం అని విమర్శించారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా నారా లోకేశ్ లేవడని అన్నారు. 



More Telugu News