పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారంటూ వార్తలు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- లీటర్ పై రూ.6 వరకు తగ్గిస్తారంటూ ప్రచారం
- మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి
- ధరలు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడి
- మంత్రి వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లో లాభపడిన చమురు సంస్థల షేర్లు
దేశంలో నూతన సంవత్సర ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. లీటర్ పై రూ.6 వరకు తగ్గించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టతనిచ్చారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఊహాజనితం అంటూ కొట్టిపారేశారు. చమురు ధరలు తగ్గించాలన్న ఉద్దేశంతో పెట్రోలియం సంస్థలతో చర్చలు జరపడంలేదని, తాము ధరలు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నామని మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.
కాగా, చమురు ధరలు తగ్గించే అవకాశం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో, దేశీయ స్టాక్ మార్కెట్లో చమురు మార్కెటింగ్ సంస్థల షేర్లు రివ్వున దూసుకెళ్లాయి. హెచ్ పీసీఎల్ షేర్లు 3 శాతానికి పైగా లాభపడగా.... ఐఓసీ, బీపీసీఎల్ సంస్థల షేర్లు 2 శాతానికి పైగా వృద్ధి నమోదు చేశాయి.