మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు: 'హను మాన్' నిర్మాత!
- ఈ నెల 12వ తేదీన 'హను మాన్' రిలీజ్
- భారీ బడ్జెట్ తో నిర్మించిన నిరంజన్ రెడ్డి
- తమ సినిమాలో అనేక ప్రత్యేకతలున్నాయని వెల్లడి
- పండుగ రోజుల్లో పోటీ సహజమేనని వ్యాఖ్య
తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను మాన్' సినిమాను రూపొందించాడు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన థియేటర్లకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
" తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో కొన్ని విశేషాలు .. ప్రత్యేకతలు ఉన్నాయి. ఆడియన్స్ ను థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో వాటిని మేము గోప్యంగా ఉంచాలనుకున్నాము. కొంతమంది ఆర్టిస్టులను వేరే ఇండస్ట్రీల నుంచి తీసుకున్నాము. అందుకు కారణం ఆ పాత్రలకు వారు మాత్రమే సెట్ అవుతారని భావించడమే" అన్నారు.
" సాధారణంగా పండుగ సందర్భాల్లో పోటీ ఉండటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోటీలో నుంచి తప్పుకోమనీ .. లేదంటే థియేటర్లు దొరక్కుండా చేస్తామని మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. నిజానికి అలాంటిదేం లేదు. మిగతా సినిమాల మాదిరిగానే మా సినిమా కూడా థియేటర్లకు వచ్చేస్తుంది" అని చెప్పారు.