బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా బండి సంజయ్ నియామకం.. ఎన్నికల ముందు కీలక బాధ్యతలు

  • 2024 ఎన్నికలకు ముందు పునర్‌వ్యవస్థీకరణ చేపట్టిన బీజేపీ అధిష్ఠానం
  • యువమోర్చా ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌కు బాధ్యతల అప్పగింత
  • తరుణ్ చుగ్‌ సహా పలువురు సీనియర్లను వివిధ విభాగాలకు ఇన్‌ఛార్జులుగా నియామకం
లోక్‌సభ ఎన్నికలు-2024 సమీపిస్తుండడంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్‌వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించింది. పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్‌ సహా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది. యువమోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జిగా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్ఠానం నియమిచింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా బైజ్యంత్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్‌ పేర్లను పార్టీ బుధవారం ప్రకటించింది.

కాగా జులై 2023లో చివరిసారిగా బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను పునర్‌వ్యవస్థీకరించింది. ఇక గతేడాది డిసెంబర్‌లో బీజేపీ పంజాబ్ రాష్ట్ర పార్టీ విభాగాల ఇన్‌ఛార్జులను మార్చింది. వివిధ విభాగాలకు 70 మందితో ఇన్‌ఛార్జులు, సహ ఇన్‌ఛార్జులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ ఈ మేరకు పార్టీలో మార్పులు చేస్తోంది.


More Telugu News