ప్రేమ కోసం ఏం చేసినా తప్పులేదు: 'నా సామిరంగ' నుంచి భాస్కర్ ఇంట్రో గ్లింప్స్

  • నాగార్జున నుంచి 'నా సామిరంగ'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • ముఖ్యమైన పాత్రల్లో అల్లరి నరేశ్ - రాజ్ తరుణ్
  • ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల

నాగార్జున కథానాయకుడిగా 'నా సామిరంగ' సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఈ నెల 5వ తేదీతో షూటింగును పూర్తి చేసుకోనుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది.అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 

ఈ సినిమాలో రాజ్ తరుణ్ ... భాస్కర్ అనే పాత్రను పోషించాడు. ఆ పాత్రను పరిచయం చేస్తూ, అతని లవ్ కి సంబంధించిన గ్లింప్స్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 1980లో నడిచే ఈ ప్రేమకథలో .. అమ్మాయి వెంటపడటం ... ఆమెను ముగ్గులోకి దింపడం .. ప్రేమకోసం పక్క ఊరు ప్రెసిడెంట్ గారి గోడనే కాదు .. పక్కదేశం గోడ దూకినా తప్పులేదనేది అతని ఉద్దేశం. 

ఎర్రబస్సులు ... రిబ్బను జడలు .. మట్టి గాజులు .. ఇంకు పెన్నులు .. ఇలా ఆ కాలం నాటి వాతావరణంలో సాగే భాస్కర్ ప్రేమాయణం .. అప్పటి యూత్ ను ఆ కాలంలోకి తీసుకుని వెళ్లేమాదిరిగానే ఉంది. భాస్కర్ లవర్ గా రుక్సార్ థిల్లాన్ కనిపించింది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సింగిల్ వదలనున్నారు.




More Telugu News